26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రజా నిలయంలో పీసీసీ చీఫ్  పుట్టినరోజు వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో టి పి సి సి అధ్యక్షుడు  , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నామన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సెక్రెటరీ గోపి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రంజిత్, మహిపాల్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆనంద్, మండల ఉపాధ్యక్షుడు బద్దం దేవేందర్, ఫైమన్ కమిటీ సభ్యుడు గంగ నరసయ్య, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్, బ్రహ్మనాయుడు, కుంట శీను, సాయిరాం, నాగభూషణం, గంగారెడ్డి, రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article