26.3 C
Hyderabad
Monday, August 3, 2026

కలెక్టరేట్ లో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో  షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రసంగిస్తూ భాగ్యరెడ్డి వర్మ జీవిత విషయాలను తెలుపుతూ వారు చేసిన  సామాజిక కార్యక్రమాలను, ఆదిహిందూ ఉద్యమాన్ని ప్రారంభించి అణగారిన వర్గాల హక్కులు, గుర్తింపుల కోసం పోరాటం సాగించారనీ, గాంధీ తో కూడా సన్నిహిత సంబందాలు కలిగి వున్నారు అని తెలిపారు. నిజాం ప్రభుత్వం లో అడ్వైసర్ కూడా పని చేశారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీడీఓ రజిత, ఎస్సి కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, ఇతర జిల్లా అధికారులు , జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్. భీమ్ కుమార్, సహాయ సంక్షేమ అధికారులు , వసతి సంక్షేమ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article