25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

భూ భారతి సర్వే పనులు వేగవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : భూ భారతి సర్వే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం లింగం పేట్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి సర్వే డెస్క్ పనులను ఆయన సబ్ కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ కింద మండలంలోని 25 గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించడం జరిగిందని , అట్టి సదస్సులలో పలు సమస్యలకు సంబంధించి 4225 దరఖాస్తులు రావడం జరిగాయని తెలిపారు. సదస్సులలో వచ్చిన దరఖాస్తులను రెవిన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో 4100 దరఖాస్తులను పరిశీలించి, సర్వే చేయడం జరిగాయని తెలిపారు. డెస్క్ వర్క్ ను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్, తహసీల్దార్ సురేష్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Bhu Bharati survey work should be expedited.

More articles

Latest article