23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

గ్లామర్ హోటల్ నిర్వాహకుడికి జైలుశిక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిర్ణీత సమయం తరువాత హోటల్ తెరిచి ఉంచిన నగరంలోని గ్లామర్ హోటల్ నిర్వాహకుడు అర్షదుద్దీన్ కు న్యాయస్థానం ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. బుధవారం అర్ధరాత్రి హోటల్ తెరిచి ఉంచడంతో అర్షరుద్దీన్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఒక రోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారన్నారు. దుకాణాలు, హోటళ్లు, పాన్ షాపులను నిర్ణీత సమయం తరువాత మూసివేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని ఎస్ హెచ్ వో హెచ్చరించారు.

More articles

Latest article