భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని లింగపూర్ లో ఏర్పాటు చేసిన డాక్టర్. బీ. ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ను విజయవంతం చేయాలని నిర్వాహకులు గడాల ప్రసాద్, గట్టు ఈశ్వర్ లు l సంయుక్తంగా కోరారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతు నేడు జరిగే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా ఉన్నత విద్యమండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్.రిక్క లింబాద్రి, స్వచ్చంద చేయూత సంస్థ వ్యవస్థపకులు డాక్టర్. మధు శేఖర్,ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ. డాక్టర్. కాషీం,తెలంగాణ విశ్వ విద్యాలయ ప్రొ.పున్నయ్య లు హాజరౌతున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమం లోబహుజన యుద్ధ నౌక, గాయకుడు.ఏపూరి సోమన్న బృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ మీడియా సమావేశం లో నిర్వహణ కమిటీ సభ్యులు పర్స నవీన్, రతన్ రాజ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
