27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజీవ్ గాంధీ

Must read

📰 Generate e-Paper Clip

  • బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజీవ్ గాంధీ నిలిచిపోతారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. భారత రత్న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నగరంలోని కాంగ్రెస్ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నాయక్ నగర లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ యువతను 18 ఏళ్ల వయసులో ఓటు హక్కు కల్పించి యువతను రాజకీయాలలో చురుగ్గా పాల్గొనేలా చేసిన సంస్కరణకర్త అని, ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పాలనడక్షులు అని తెలిపారపు. జాతీయ విద్య విధానం అమలు చేసి దేశాన్ని ముందుకు నడిపిన విద్యావేత్త అని కొనియాడారు. 40 ఏళ్ల వయసులోనే దేశానికి ప్రధాని అయిన గొప్ప నేత అని, దేశ మొదటి ప్రధాని నెహ్రూ మనుమడిల, ఏకైక మహిళ ప్రధాని ఇందిరా గాంధీ పెద్ద కుమారుడిగా గొప్ప పేరు ఆయనకు ఉంది అని అన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి ఐదేళ్ల పాటు ఆయన సేవలు అందిస్తూ అభివృద్ధి చేశారు అని అన్నారు.    ప్రతిపక్ష నేత అటల్ బిహారి వాజ్పేయ్ ఆరోగ్యం కోసం యుద్ధ ప్రాతిపదికన ఆర్ధిక “సహాయం మంజూరు చేసిన చరిత్ర రాజీవ్ గాంధీదని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్,డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,మాజీ పిసిసి కార్యదర్శి రామ్ భూపాల్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు గోపి,రాష్ట్ర ఎన్ఎస్యూఐ  ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ,జిల్లా ఫిషర్మాన్ అధ్యక్షులు శ్రీనివాస్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసా,పోల ఉష,పుప్పాల విజయ,సుభాష్ జాదవ్,సలీం, అవిన్,సంగెం సాయిలు,యెండల కిషన్,నికిల్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

Rajiv Gandhi remains immortal in the hearts of the people of the country.

More articles

Latest article