24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పేదల కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: పేదల కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తల కృషి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో డిచ్ పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృత పూర్ గంగాధర్, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉమ్మాజీ నరేశ్, నాయకులు వాసు బాబు, ధర్మా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article