25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రిన్సిపాల్ పై యాసిడ్ దాడి

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ: తనను విధుల్లో నుంచి తొలగించారని ఓ లేడీ టీచర్ ప్రిన్సిపాల్ పై యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటుపల్లి డాన్ బోస్కో స్కూల్ లో ఇబ్రహీం పట్టణానికి చెందిన ప్రియదర్శి టీచర్గా పని చేస్తోంది. విద్యార్థులను తరచూ కొడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ప్రియదర్శినిని ప్రిన్సిపాల్ విధుల్లో నుంచి తొలగించారు. ఈ క్రమంలో సోమవారం పాఠశాలకు వచ్చిన ఆమె తనను విధుల్లో నుంచి ఎందుకు తొలగించారని ప్రిన్సిపాల్ తో వాగ్వాదానికి దిగి యాసిడ్ దాడి చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article