28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులను విష జ్వరాల నుండి కాపాడాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంజలి, రఘురాం

బతుకమ్మ నిజామాబాద్ : గురుకుల, సంక్షేమ హాస్టల్లో కేజీబీవీ లో చదువుతున్న విద్యార్థులను విష జ్వరాల నుండి కాపాడాలని ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంజలి, రఘురాం కోరారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల, సంక్షేమ, కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు విష జ్వరాల బారీన పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి హాస్టల్ పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు అవసరమైన మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని అన్నారు. విద్యార్థులకు 24 గంటల పాటు వైద్య సౌకర్యం అందుబాటులో ఉండేటట్టు చూడాలన్నారు. హాస్టల్ వార్డెన్లు జిల్లా వ్యాప్తంగా సమయపాలన పాటించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ నగర సహాయ కార్యదర్శి నవీన్ కృష్ణ, నాయకులు శివాజీ, స్వామి పాల్గొన్నారు.

Students should be protected from toxic fevers

More articles

Latest article