- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : కాళేశ్వరం ప్యాకేజీ 22 కెనాల్ పనులకు ప్రభుత్వం 23.15 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఇర్రిగేషన్ సీఈఓ శ్రీనివాస్, ఎల్లారెడ్డి ఈ ఈ మల్లేష్ లు కలిసి భూసేకరణ పనులపై కలెక్టర్ తో చర్చించారు. కెనాల్ పనులకు 316 ఎకరాలకు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంకా 97 ఎకరాలు అవార్డ్ స్టేజీ లో ఉన్నందున రైతులకు చెల్లింపులు చేయుటకు కలెక్టర్ ను ఇంజనీరింగ్ అధికారులు కోరారు. సబ్ డివిజన్ రికార్డు స్టేజిలో 203 ఎకరాలు ఉన్నందున అట్టి దానిని అవార్డు స్టేజీ కి తీసుకువెళ్ళడానికి ఆర్డీఓ కు సూచిస్తూ భూ సేకరణ పనులు త్వరగా చేసే విధంగా కలెక్టర్ ఆదేశించారు.
