27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

నేను సాటిస్ ఫై అయితేనే..

Must read

📰 Generate e-Paper Clip

  • ఏవో కుటుంబ సభ్యులకు ఏడాదిగా ఏడిఏ వేధింపులు
  • కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా.. విచారణ జరిపినా చర్యలు శూన్యం
  • కలెక్టరేట్ లో బాధిత కుటుంబం నిరసన

 

నిజామాబాద్, బతుకమ్మ : మండల వ్యవసాయాధికారిగా ఉత్తమ సేవలకు గాను రెండుసార్లు అవార్డు దక్కించుకున్న వ్యక్తి హఠాన్మరణం ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని నింపింది. గెజిటెడ్ అధికారిగా అందరి మనన్నలు పొందిన ఆయన కుటుంబం ఏడాదిగా విధి నిర్వహణలో గుండెపోటుతో మరణిస్తే అతని కుటుంబానికి రావాల్సిన ఒక్క ప్రయోజనం కూడా దక్కలేదు. ఏడాది కాలంగా నిజామాబాద్ కలెక్టరేట్ లోని వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టు అతని కుటుంబం తిరిగి తిరిగి వేసారిపోయింది. అతనికి ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ దక్కకపోగా ఏడిఏ స్థాయి అధికారి మాటలు కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయి. నేను సంతృప్తి (సాటిస్ ఫై అయితేనే) పొందితేనే ప్రపోజల్స్ పైకి పంపిస్తానని ఏడాది కాలంగా ఏవో సతీమణిని వెకిలి మాటలతో వేధించినట్లు బాధితురాలు ఆరోపించింది. ఏడాది కాలంగా ప్రవీణ్ తోటి అధికారులకు, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘానికి గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ఏడిఏ వేధింపులను మౌనంగా భరించిన కుటుంబం బుధవారం నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయంలో గల వ్యవసాయ శాఖ ఏడిఏ కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. దాంతో ఈ వ్యవహరం బట్టబయలైంది.

నిజామాబాద్ జిల్లాలో ఒక మండల స్థాయి గెజిటెడ్ అధికారి మరణించగా అతని కుటుంబానికి ప్రభుత్వపరంగా రావాల్సిన బెనిఫిట్ అందజేయడంలో సంబంధిత శాఖాధికారులు విఫలమయ్యారు. కానీ అదే శాఖలో పని చేస్తున్న జిల్లా స్థాయి అధికారి పదవి విరమణ చేసిన మూడు నెలలకే అతనికి పెన్షన్ ప్రయోజనాలను కట్టబెట్టిన వ్యవసాయ శాఖలో ఏడిఏ స్థాయి అధికారి ఒక మండల స్థాయి అధికారి కుటుంబాన్ని వేధించిన తీరు కలకలం రేపుతోంది. ఏడాది కాలంగా ప్రవీణ్ అనే మండల వ్యవసాయాధికారి కుటుంబం తమ ప్రయోజనాలు కలిపించాలని వ్యవసాయ శాఖ కార్యాలయానికి చక్కర్లు కొడుతుంది. అయితే ఏడిఏ స్థాయి అధికారి సంబంధిత ప్రపోజల్ ఫైల్ ను ముందుకు కదలించకపోవడంతో ఆ కుటుంబానికి రావాల్సిన రూ.11 లక్షలు నష్టపోయారు. ఈ విషయంలో మండల స్థాయి అధికారులు కలిసి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.  ఈ విషయంపై బాధిత కుటుంబం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా ఆయన అదనపు కలెక్టర్ ద్వారా విచారణ జరిపించి చర్యకు సిఫారసు చేశారు. అవి ఇప్పటికి కార్యరూపం దాల్చలేదు కానీ తన అధికారాన్ని ఉపయోగించి వ్యవసాయ శాఖలో 25 మంది ఏవోల పై విచారణ జరిపి చర్య తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారికే ఫిర్యాదు చేయడం గమనార్హం. ఏకంగా తనను వేధిస్తున్నారని పోలీసులకు న్యూసెన్స్ చేస్తున్నారని బెదిరించినట్లు గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆరోపించింది.

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వ్యవసాయాధికారి ప్రవీణ్ హఠాన్మరణం అతని కుటుంబానికి రావాల్సిన ప్రయోజనాల విషయంలో వ్యవసాయ శాఖాధికారుల తీరుపై జిల్లా గెజిటెడ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్ కు బాధిత కుటుంబం ఫిర్యాదు చేయగా జేసీ ద్వారా విచారణ జరిపినా చర్యలు తీసుకోకపోగా ఏడిఈ వేధింపులు పరాకాష్టకు చేరడంపై జిల్లాలోని మండల వ్యవసాయాధికారులు ఆందోళనకు సిద్దమౌతున్నారు. ఈ విషయంలో జిల్లా అధికార యంత్రాంగంతో తాడోపేడో తేల్చుకునేందుకు రంగం సిద్దం చేశారు. ఏడిఏపై చర్యలు తీసుకుంటారా? లేక సామూహిక సెలవులో వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గెజిటెడ్ అధికారుల సంఘం, జిల్లాలోని మండల వ్యవసాయాధికారులు సమావేశం కావాలని బుధవారం నిర్ణయించారు. జిల్లా అధికార యంత్రాంగం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

If I am satisfied..

More articles

Latest article