27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

యువకుడి ప్రాణం తీసిన ఆన్ లైన్ గేమ్

Must read

📰 Generate e-Paper Clip

  • ఉరేసుకుని యువకుని ఆత్మహత్య

 

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం రాయాకూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆన్ లైన్ గేమింగ్ యువకుడి ప్రాణం తీసింది. రుద్రూర్ ఎస్సై పి.సాయన్న తెలిపిన వివరాల ప్రకారం..రాయకూర్ గ్రామానికి చెందిన మాగిరి గంగాధర్ (20) అను యువకుడు ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడటానికి అలవాటు పడ్డాడని, ఆన్ లైన్ గేమ్స్ ఆడటానికి తన తండ్రి ఫోన్ నుండి 5000 రూపాయలు తన ఫోన్ కి పంపుకొని ఆన్ లైన్ లో గేమ్స్ ఆడి ఆ డబ్బులను పోగొట్టుకున్నాడు. డబ్బులు పోయాయన్న మనస్థాపంతో గంగాధర్ మంగళవారం రాత్రి సమయంలో రాయకూర్ గ్రామంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి మాగిరి పోశెట్టి ఫిర్యాదు మేరకు బుధవారం ఎస్సై పి.సాయన్న  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

More articles

Latest article