23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

బిచ్కుంద పీఎస్ లో ఏసీబీ సోదాలు

Must read

📰 Generate e-Paper Clip

బిచ్కుంద, బతుకమ్మ: ఇసుక అక్రమ రవాణా, మామూళ్ల వసూల ఫిర్యాదుల నేపథ్యంలో బిచ్కంద పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. ఈ ఘటన అటు పోలీసుల్లో, ఇటు వ్యాపారుల్లో కలకలం రేపింది.

ఉదయం స్టేషన్ కు చేరుకున్న ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకోగా, వాటిని వదిలేందుకు డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణతో ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. పక్కనే ఉన్న సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ విఠల్ రెడ్డి, సీఐ జగడం నరేశ్ ఉండగా, పీఎస్ లో ఎస్సై ఉన్నారు. సోదాలు కొనసాగుతున్నాయి.

ఇసుక అక్రమ రవాణా విషయంలో ఎప్పుడూ బిచ్కుంద పీఎస్ మరో సారి వార్తల్లోకి ఎక్కింది. ఇసుక అక్రమరవాణా చేస్తున్న వారి నుంచి ముడుపులు తీసుకుంటన్నారని మూడేళ్ల క్రితం ఇదే పీఎస్ లో పని చేస్తున్నముగ్గురు కానిస్టేబుళ్లను అప్పటి ఎస్పీ శ్వేతారెడ్డి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

More articles

Latest article