బిచ్కుంద పీఎస్ లో ఏసీబీ సోదాలు
బిచ్కుంద, బతుకమ్మ: ఇసుక అక్రమ రవాణా, మామూళ్ల వసూల ఫిర్యాదుల నేపథ్యంలో బిచ్కంద పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. ఈ ఘటన అటు పోలీసుల్లో, ఇటు వ్యాపారుల్లో కలకలం రేపింది. ఉదయం స్టేషన్ కు చేరుకున్న ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకోగా, వాటిని వదిలేందుకు డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణతో ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. పక్కనే ఉన్న సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ విఠల్ రెడ్డి,...