28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు

 

భీమ్ గల్, బతుకమ్మ :  ఈనెల 20న దేశవ్యాప్తంగా కార్మిక సమస్యల పరిష్కారం కొరకు కేంద్ర కార్మిక సంఘాల సమైక్య ఇచ్చిన పిలుపులో భాగంగా నిర్వహించనున్న  సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు,సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ లు సంయుక్తంగా పిలుపునిచ్చారు. సోమవారం భీమ్ గల్ మున్సిపల్ కార్మికుల సర్వ సభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు సమావేశం లో మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయటంతో పాటు ప్రజల పైన భారాలు మోసే పద్ధతుల్లో ధరలను విపరీతంగా పెంచి అన్ని వర్గాల ప్రజల పైన కేంద్రం ఆర్థిక భారాలు మోపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్పోరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని, కార్మిక వర్గం ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న 29 చట్టాలను మార్చి నాలుగు కోట్లుగా విభజించారని ఏద్దేవా చేశారు. వీటి మూలంగా కార్మికుల హక్కులు హరించబడతాయన్నారు. తమ హక్కుల సాధన కోసం,సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా, సమైక్యంగా సమ్మెకు పిలుపునివ్వటం జరిగిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకొని ఎడల భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం భీమ్ గల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్ కు సమ్మె నోటీసును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు భీమ్ గల్ అధ్యక్షులు ఓంకార్ , కార్యదర్శి నవీన్, సహాయ కార్యదర్శి విజయ, ఉపాధ్యక్షులు విశ్వనాధ్ , కోశాధికారి ప్రవీణ్ తదితరులతో పాటు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

More articles

Latest article