వెబ్ న్యూస్, బతుకమ్మ : దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాలు తెరుచుకొని రాకపోకలు ప్రారంభించాయి. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా గత వారం ఉత్తర, పశ్చిమ భారత్ లో పౌర విమాన సర్వీసులను నిలిపివేశారు. ఈనెల 15 వరకు ఎయిర్ పోర్టులను మూసివేయాలని భావించినా.. కాల్పుల విరమణ కారణంగా పరిస్థితులు మెరుగుపడటంతో తెరిచారు. పౌర విమాన సర్వీసులు వెంటనే అందుబాటులోకి వస్తాయని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రయాణికులు ఎయిర్ లైన్స్ సంస్థల వెబ్ సైట్లు పరిశీలించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
