24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ సొమ్ము ను కాంగ్రెస్ కార్యకర్తలకు పంచిపెడితే ఊరుకునేది లేదు

Must read

📰 Generate e-Paper Clip

. . . మాజీ మంత్రి , బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ : 

 

ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ 7 ప్రకారం గ్రామ సభలోనే జరగాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటై 17 నెలలు అయినా ప్రతి అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇస్తే ప్రజలు నమ్మి ఓట్లేసారన్నారు. దసరా, సంక్రాంతి అని బూటకపు మాటలు చెబుతూ వాయిదా వేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు  ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టలేదని, జిల్లాలో లక్ష 80 వేల మంది పేదలు దరఖాస్తు చేసుకుంటే కాంగ్రెస్ నేతలు ఇళ్లలో కూర్చోని 70 వేల మంది అర్హులను ఎంపిక చేశారని అందరికీ ఇల్లు వస్తాయని అందరినీ నమ్మించారన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎవరు అర్హులో  దరఖాస్తు చేసుకున్న వారిలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిన జీ.ఓ నంబర్ 7 ప్రకారం అర్హుల జాబితా గ్రామ సభలో పెట్టీ ఎంపిక చేయాలని ఉందని, అర్హత జాబితా తర్వాత  లబ్ధిదారులను గ్రామ సభ ద్వారా అంగీకారం తెలిపిన వాళ్లకు జిల్లా కలెక్టర్ మంజూరు చేయాలన్నారు. గ్రామ సభల ద్వారానే ఎంపిక చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఒక్క గ్రామ సభ పెట్టలేదని, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో జాబితా ఫైనల్ అవుతుందన్నారు. ఇంటికి రూ.50 వేలు ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ జీ ఓ 7 ప్రకారమే గ్రామ సభలో చేసిన సిఫారసు లనే కలెక్టర్ ఫైనల్ చేయాలని,  కాంగ్రెస్ నేతలు ఫైనల్ చేస్తే పేదలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. న్యాయంగా ఇల్లు రావాల్సిన వాళ్లకు గులాబీ కార్యకర్తలు అండగా నిలవాలని, ఇందిరమ్మ ఇళ్ళు రాని వాళ్ళతో తహశీల్దార్ కార్యాలయం, గ్రామ పంచాయతీ ల ముందు నిరసన తెలపాలన్నారు.గ్రామ సభ ద్వారానే లబ్ధిదారులను ఎంపిక డిమాండ్ చేయాలన్నారు. రాజీవ్ యువ వికాస్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రూ. లక్ష నుంచి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. రాజీవ్ యువ వికాస్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు, డబ్బులు ఇచ్చిన వాళ్లకు ఇవ్వబోతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు పై సీఎం ఒక్కసారి కూడా రివ్యూ పెట్టలేదని, అందాల పోటీల కోసం పదిసార్లు రివ్యూ పెట్టిన రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకుని వరి ధాన్యం కొనుగోలు పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పి చైర్మన్ విఠల్ రావు,నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,సత్య ప్రకాష్,సుదాం రవిచందర్,నవీద్ ఇక్బాల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజగౌడ్,ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పి చైర్మన్ విఠల్ రావు,నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,సత్య ప్రకాష్,సుదాం రవిచందర్,నవీద్ ఇక్బాల్, బీఆర్ఎస్  సీనియర్ నాయకులు రాజగౌడ్,ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article