ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఎన్జీఓ గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకున్న మహిళలకు 60శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు ఎల్లారెడ్డి మండల ఎంపీడీఓ ప్రకాష్ అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ కవిత పాల్గొన్నారు.

