బతుకమ్మ బాన్సువాడ : పత్రికా సంపాదకులపై అక్రమ కేసులు బనాయించడం హేయమైన చర్య అని జర్నలిస్టులు ఆరోపించారు. బాన్సువాడ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. సాక్షి ప్రధాన సంపాదకుడిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని అనుమతి లేకుండానే ఆయన ఇంట్లో సోదాలు చేయడం సరైంది కాదన్నారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్ గౌడ్, చంద్రశేఖర్, విలేకరులు సుధాకర్, లతీఫ్, వరప్రసాద్, అంబేల్పూర్ రాజు, శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, జాకిర్, సతీష్ గౌడ్, రామా గౌడ్, సుందర్ పాల్గొన్నారు.
