24.7 C
Hyderabad

భారత రక్షణ వ్యవస్థను పాక్ లక్ష్యం చేసింది

Must read

📰 Generate e-Paper Clip

. మన వైమానిక స్థావరాలకు ఎక్కడా నష్టం జరగలేదు

. పాక్ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పు

. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్

వెబ్ న్యూస్, బతుకమ్మ: పాకిస్తాన్ భారత రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుందని, పంజాబ్ లోని ఓ ప్రాంతంపై హై స్పీడ్ క్షిపణిని ప్రయోగించిందని వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ తెలిపారు. పాకిస్తాన్ 26 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుందని అన్నారు. పాకిస్తాన్ చర్యలు రెచ్చగొట్టేవిగా, ఉద్రిక్తతలను పెంచేవిగా ఉన్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి అన్నారు.

భారత్ పై దాడుల గురించి పాక్ వాదనలు అబద్దాలని, తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. అలాగే భారత్ ఆప్ఘనిస్తాన్ ను లక్ష్యంగా చేసుకుందని పాకిస్తాన్ తప్పుడు ప్రచారంచేస్తోందన్నారు. తమ దేశాన్ని ఏ దేశం టార్గెట్ చేసింది ఆప్ఘనిస్థాన్ ప్రజలకు తెలుసని అన్నారు. భారత్ లోని సిర్సా, సూరత్గఢ్ పైదాడి చేసి వైమానిక స్థారాలను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని అన్నారు.

More articles

Latest article