28.9 C
Hyderabad

పాక్ కీలక స్థావరాలపై దాడులు చేశాం

Must read

📰 Generate e-Paper Clip

విదేశాంగ, రక్షణ శాఖ అధికారులు

డిల్లీ, బతుకమ్మ :  పాక్ లోని సాంకేతిక మౌలిక సదుపాయాలు,  కమాండ్ సెంటర్లే లక్ష్యంగా, పైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లతో కీలక స్థావరాలపై దాడులు చేశామని విదేశాంగ, రక్షణ శాఖ అధికారులు తెలిపారు. డిల్లీలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో  విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, కర్నల్ సోఫియా ఖురేషి మాట్లాడారు.   ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ లాంఛర్లను ధ్వంసం చేశామన్నారు.  శ్రీనగర్, ఉదంపూర్, భటండా, భుజ్ లో  పాక్ దాడులకు పాల్పడుతోందన్నారు. పంజాబ్ లోని ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకుందన్నారు. శ్రీనగర్ నుంచి నలియా వరకు భారీ దాడులకు పాల్పడుతోందన్నారు. పాక్ బలగాలు సరిహద్దు వైపు ముందుకు వస్తున్నట్లు గమనించామని పేర్కొన్నారు.

More articles

Latest article