28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బైక్ దొంగ అరెస్ట్ 

Must read

📰 Generate e-Paper Clip

. . . కొలిక్కి వచ్చిన గుడి దొంగతనాలు

. . . రెండు బైక్ లు స్వాధీనం

మోపాల్, బతుకమ్మ :

 

మోపాల్ చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎలాంటి పత్రాలు లేకుండా బైక్ పై ప్రయాణిస్తున్నా పాత నేరస్తుడిని పట్టుకుని విచారించగా మోపాల్ మండలంలో జరిగిన బైక్ దొంగతనాలతో పాటు గుడి దొంగతనాల కేసులు కొలిక్కి వచ్చాయని నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం మోపాల్ పోలీస్ స్టేషన్ లో సిఐ సురేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం మోపాల్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిజామాబాద్ నగరంలోని రోటరి నగర్ కు చెందిన భూమిగారి నవీన్ అనే పాత నేరస్తుడు పట్టుబడ్డాడు. అతన్ని విచారించగా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు బైక్ దొంగతనాల కేసులతో పాటు మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామ శివారులో, ముదక్ పల్లి గ్రామంలోని రెండు గుడిలలో జరిగిన దొంగతనాలు కేసులు కొలిక్కి వచ్చాయన్నారు. నవీన్ పై ఇది వరకే నగరంలోని 4వ టౌన్ పరిధిలో దొంగతనాల కేసులు నమోదు కాగా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపగా మూడు సంవత్సరాల జైలు జీవితం గడిపారన్నారు. రెండు సంవత్సరాల క్రితం జైలు నుంచి విడుదలైన తర్వాత నవీన్ ఆటో నడుపుతున్నాడని అయినప్పటికీ డబ్బులు సరిపోవడం లేదని మళ్ళీ దొంగతనాలకు చేస్తున్నాడని తెలిపారు. నవీన్ వద్ద రెండు బైక్ లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపుతున్నట్లు సిఐ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సై యాదగిరి, ఏఎస్సై రమేష్ తో పాటు సిబ్బందిని సిఐ అభినందించారు.

Bike thief arrested

More articles

Latest article