భీమ్ గల్, బతుకమ్మ : వైశాఖ శుద్ధ మోహిని ఏకాదశి గురువారం భీమ్ గల్ గ్రామాలయంలో శ్రీ వారి జయంతి ఉత్సవాలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆరవ రోజైన గురువారం ఉదయం గ్రామాలయంలోని గర్భలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి, స్వామి వారికి హారతి, నైవేద్యం లను సమర్పించారు. సాయంత్రం స్వామి సాయంకాల పూజ అనంతరం స్వామి ఉత్సవమూర్తులను హనుమద్వాహానము పై ఆశీనుల చేసి, వాహనాన్ని అలంకరించి గ్రామాలయ పురవీధుల్లో గోవిందా… గోవిందా.. జయ నర్సింహా… జయ నర్సింహా స్వామివారిని నినాధాల మధ్య ఊరేగించారు.
