27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కర్రెగుట్టల్లో 22 మంది మావోలు.. ములుగు జిల్లాలో ముగ్గురు పోలీసులు మృతి

Must read

📰 Generate e-Paper Clip

ఖమ్మం, బతుకమ్మ: ఛత్తీస గఢ్ రాష్ట్రంలోని బీజాపుర్ జిల్లా ఊసూరు పరిధిలో ఉన్న కర్రెగుట్టల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకోగా, 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కేంద్ర భద్రతాబలగాలు ఇప్పటి వరకు 18 మంది మావోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. భీకర ఆపరేషన్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రకటించారు. ఏప్రిల్ 22న ప్రారంభమైన ఆపరేషన్ 16 రోజులుగా కొనసాగుతోంది.

మరోవైపు ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు తెలిసింది. వెంకటాపురం మండలంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకన్నల్లు తెలియగా పోలీసుశాఖ ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు.

More articles

Latest article