- భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మాక్ డ్రిల్స్
ఢిల్లీ, బతుకమ్మ : ఈనెల 7న(బుధవారం) దేశ వ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికల ప్రకరాం ఉగ్రదాడి జరిగు ప్రాంతాలలో ఢిల్లీ, ముంబై, చెన్నై, సూరత్, వడోదరతో సహా..అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న పలు నగరాలు క్యాటగిరి 1 లో ఉన్నాయి. తెలంగాణ లో హైదరాబాద్, ఆంధ్రాలో విశాఖపట్నంలోనూ మాక్ డ్రిల్స్.. రెండు నగరాలు క్యాటగిరి 2 లో ఉన్నాయి. కశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల మాక్ డ్రిల్స్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.

- 54 సంవత్సరాల తర్వాత..
1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసమని.. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో పౌరుల భద్రత కోసమని అప్పటి ప్రభుత్వం యుద్ధానికి ముందు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్‌ను నిర్వహించింది. ఇప్పుడు 54 ఏండ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వం మాక్‌డ్రిల్స్ నిర్వహిస్తుంది.

