28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సాయంత్రం ప్రకంపనలు.. రాత్రి వర్షం..

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లాలో రైతుల ఆగమాగం

 

నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో భూప్రకంపనలు కలకలం రేపాయి. సోమవారం సాయంత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, జగిత్యాల్,  పెద్దపల్లి, నిర్మల్ జిల్లాలతో పాటు వేములవాడ, కోరుట్ల, బాల్కొండ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. సాయంత్రం ఆకస్మిక ప్రకంపనలతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి ఆకస్మాత్తుగా వర్షంతో హడలెత్తించింది. రైతులకు,

Evening tremors.. Night rain..

సాధారణ ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ప్రధానంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన రైతులు అవి తూకం వేయక, కల్లాల వద్ద ధాన్యంను ఆరబోసిన రైతులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ధాన్యం రోడ్లపైనే కల్లాలపైనే మార్కెట్ యార్డులో తడిసిపోయింది. ఆకస్మిక వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Evening tremors.. Night rain..

More articles

Latest article