29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నగర శివారులోని బోర్గాం(పి) పరిధిలో ఉన్న 586/1, 586/2 సర్వే నంబర్లలోని 1.21 ఎకరాల ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త చిలుక శ్రీనివాస్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రెవెన్యూ రికార్డుల్లో 50 సంవత్సరాలుగా ప్రొహిబిటేడ్ ల్యాండ్ గా, 1954 – 55 సేత్వార్ ప్రకారం 22(ఏ)లో శిఖం తలాబ్ గా ఉన్న శిఖం భూమిని కబ్జాకు గురికాకుండా కాపాడాలని కోరారు. ఆ భూమిలో ప్రభుత్వ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కొందరు స్థానికులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులైన సందగిరి భూమారెడ్డి, మల్ రాజ్ రతన్ రావు, మల్ రాజ్ వెంకటరమణ, సందగిరి సౌజన్యరాజశేఖర్ రెడ్డి, సందగిరి విక్రమ్ రెడ్డి, సందగిరి సాయి విశ్వాస్ రెడ్డి, గోవింద్ గారి రాజ్యలక్ష్మిగంగారెడ్డితోపాటు వారి అనుచరులు శిఖం భూమిని కబ్జా చేశారని, రెవెన్యూ అధికారులు వారికి పట్టాలు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

శిఖం భూమి గురించి మోపాల్ తహసీల్దార్ 2019లో ఇచ్చిన మెమో, ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానాన్ని గమనించకుండా, భూమి వివాదంలో ఉందని తెలిసి కూడా కొంత మంది రెవెన్యూ, సర్వే అధికారులు 1.21 ఎకరాల భూమికి హద్దులను చూపకుండానే నివేదిక అందించారని, కలెక్టర్ కార్యాలయం నుంచి కూడా తప్పుడు రికార్డులు తయారు చేసి ప్రభుత్వానికి తప్పుడు నివేదిక అందజేశారని శ్రీనివాస్ ఆరోపించారు. దీంతో ప్రభుత్వంపై నమ్మకం పోతోందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికైనా గతంలో కలెక్టరేట్ నుంచి జారీ చేసిన లెటర్ నం. ఎల్ఆర్ నం.ఈ2/95/2025 తేదీ 06/03/2025 ఉత్తర్వుల ఆదేశాల ప్రకారం 586 సర్వే నంబర్ లోని 2 ఎకరాల 38 గుంటల భూమిని మోకాపై పరిశీలించి భూమి కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, ఆ భూమిని పాఠశాల స్పోర్ట్స్ గ్రౌండ్ కు కేటాయించాల కోరారు.

More articles

Latest article