ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నగర శివారులోని బోర్గాం(పి) పరిధిలో ఉన్న 586/1, 586/2 సర్వే నంబర్లలోని 1.21 ఎకరాల ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త చిలుక శ్రీనివాస్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ రికార్డుల్లో 50 సంవత్సరాలుగా ప్రొహిబిటేడ్ ల్యాండ్ గా, 1954 – 55 సేత్వార్ ప్రకారం 22(ఏ)లో శిఖం తలాబ్ గా ఉన్న శిఖం భూమిని కబ్జాకు గురికాకుండా కాపాడాలని కోరారు. ఆ భూమిలో ప్రభుత్వ అధికారులు సూచిక...