30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీలక్ష్మీనృసింహుని జయంతి ఉత్సవాలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలోని నింబచల శ్రీలక్ష్మి నృసింహా స్వామి వారి జయంతి ఉత్సవాలను గ్రామాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త నంభి లింబాద్రి తెలిపారు. శుక్రవారం నుండి ప్రారంభం అయ్యే ఈ స్వామి ఉత్సవాలు ఈనెల 13 వరకు కొనసాగుతాయన్నారు. ఇందులో భాగంగా మొదటి రోజైన ఈ రోజు ఉత్సవ ప్రారంభం సందర్బంగా గ్రామాలయంలో ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించిన అర్చకులు పట్టణం లోని గ్రామదేవతలకు సారె సమర్పణ కార్యక్రమం ను నిర్వహించారు.ఈనెల 3న శనివారం రోజున దీప్పారాధన, స్వస్తి పుణ్యహవచనం,మాతృక, మంటప దేవతా స్థాపన,4న చంద్ర వాహన సేవ, 5నహంస వాహన సేవ, 6న శేష వాహన సేవ, 7న అశ్వవాహన సేవ, 8న హనుమద్వహన సేవ,9న గ్రామ ప్రదక్షిణ, గజవహన సేవ, 10న శ్రీ వేద వ్యాస జయంతి, శ్రీ లక్ష్మీనృసింహుని జయంతి అభ్యంగం, పంచామృతాభిషేకం, మహాభిషేకం,ప్రార్దర్బావోత్సవం, డోలాసేవ, 11న ఉదయం చిన్న గరుడ సేవ, రాత్రి పెద్ద గరుడ సేవ,12న లలితం, హారతి, మంత్రపుష్పం, 13న సీతారామ కళ్యాణం హారికథ,దేవాతోద్వాసన,ఉద్వచనం,మహాభిషేకం కార్యకమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

More articles

Latest article