శ్రీలక్ష్మీనృసింహుని జయంతి ఉత్సవాలు ప్రారంభం
భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలోని నింబచల శ్రీలక్ష్మి నృసింహా స్వామి వారి జయంతి ఉత్సవాలను గ్రామాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త నంభి లింబాద్రి తెలిపారు. శుక్రవారం నుండి ప్రారంభం అయ్యే ఈ స్వామి ఉత్సవాలు ఈనెల 13 వరకు కొనసాగుతాయన్నారు. ఇందులో భాగంగా మొదటి రోజైన ఈ రోజు ఉత్సవ ప్రారంభం సందర్బంగా గ్రామాలయంలో ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించిన అర్చకులు పట్టణం లోని గ్రామదేవతలకు సారె సమర్పణ కార్యక్రమం ను నిర్వహించారు.ఈనెల 3న శనివారం రోజున...