బతుకమ్మ,ముప్కాల్: పదవ తరగతి పరీక్ష ఫలితాలు అనేది జీవితంలో మొదటి మెట్టు అని ఇంటర్మీడియట్లో ఇంకా నాలుగు అంతలు కష్టపడి చదివి జీవితంలో అనుకున్నది సాధించాలని ముప్కల్ ఎస్సై రజినీకాంత్ అన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయని సమస్యలను సామర్థ్యంతో ఎదుర్కొని ఉన్నత స్థానంలో నిలవాలని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొక్కల్లో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన సాయి మైథిలి582/600, గంగామణి574/600, కుబుసమ్, అక్షయ్ 569/600, వర్షిని, శివలేఖ 567/600 మార్కులు సాధించడంతో విద్యార్థులను శుక్రవారం శాలువాలతో సన్మానించి వారికి మెమొంటోలు అందజేశారు. ఉత్తమ ఫలితాలు రావడానికి కారణమైన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో 1986-87 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు రాజేష్, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఎం గంగారం, నరేందర్, చిన్నయ్య, రవికుమార్, రాజేందర్, మధుసూదన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

