26.3 C
Hyderabad
Monday, August 3, 2026

వైద్యుల కుటుంబంలో మెరిసిన విద్యా కుసుమం

Must read

📰 Generate e-Paper Clip

  • కెవోఎస్ ప్రోత్సాహంతోనే పదవ తరగతిలో టాప్ మార్కులు
  • పదవ తరగతి టాప్ మార్కులతో క్రితి

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : పదవ తరగతి ఫలితాల్లో నిజామాబాద్ నగరానికి చెందిన క్రితి 596 మార్కులతో రాష్ట్రంలో టాపర్ గా నిలిచింది. తల్లిదండ్రులు ఇద్దరు వైద్య వ`త్తిలో ఉండగా తాను కూడా భవిష్యత్తులో వైద్యురాలిగా స్థిరపడుతానని అన్నారు. నగరంలోని కాకతీయ ఒలంపియడ్ స్కూల్ లో పదవ తరగతి చదివిన క్రితి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలువడంతో పాఠశాల యజమాన్యం సత్కరించింది. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఈఎన్ టీ వైద్యులు  కృష్ణ, ప్రముఖ డెంటల్ సర్జన్ సృజనల కూతురు అయిన క్రితి ఈ సందర్భంగా మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో చదువడం వల్లే స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించారని తెలిపింది. తనకు చదువు అంటే ఇష్టమని నిత్యం ప్రత్యేకంగా నోట్స్ తయారు చేసుకుని ప్రిపేర్ అయ్యానని, కేవోఎస్ లో రోజు నిర్వహించే స్లిప్ టెస్టులు కూడా ఐదు సబ్జెక్టుల్లో వంద మార్కులు సాధించడానికి దోహదపడ్డాయని తెలిపారు. హింది సబ్జెక్టులోనే 96 మార్కులు వచ్చాయని అన్నీ ఇంటర్నల్స్ లో బైకి బై మార్కులు రావడంతో స్టేట్ ర్యాంకు మార్కులు సాధ్యమయ్యాయని తెలిపారు. తనకు పేయింటింగ్స్ తో పాటు వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం హాబీ అని, గతంలో వ్యాసరచన పోటీల్లో బహుమతులు గెలుచుకోవడంతో పాటు పెయింటింగ్ హాబీ వలన రైటింగ్ బాగా రాయడానికి ఉపయోగపడుతుందన్నారు. కేవోఎస్ లో విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ద చూపుతారని, నిత్యం స్లిప్ టెస్టులతో పాటు స్టడీ హవర్ వల్ల అన్నీ సబ్జెక్టుల్లో ప్రావీణ్యం సంపాదించానని తెలిపారు.

A shining example of education in a family of doctors

More articles

Latest article