నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ కు చెందిన బండి సురేశ్ ఇతరుల పైన అతని భార్య మానసిక, శారీరక వేధింపులు, అదనపు వరకట్నం రెండు లక్షలు తీసుకు రావాలని వేదిస్తున్నట్లు కోర్టులో కేసు దాఖలు చేశారు. గురువారం సదరు కేసులో ముద్దాయిలపై నేర అభియోగాల నమోదు ఉంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న అరవై ఐదేళ్ల వృద్ధ మహిళ అనసూయ నడవడం సరిగా చేతకాదు,మెట్లు ఎక్కడం మరి కష్టం,ఒక వరకట్నం కేసులో నేర అభియోగాల నమోదు హాజరు తప్పని సరి.ఆ వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితిని వారి న్యాయవాది ఎర్రం విగ్నేష్ ద్వారా తెలుసుకున్న నిజామాబాద్ రెండవ అదనపు జ్యూడిషియల్ ప్రథమశ్రేణి న్యాయమూర్తి పముజుల శ్రీనివాస్ రావు జిల్లాకోర్టు మొదటి అంతస్థులోని తన కోర్టు నుండి గ్రౌండ్ ఫ్లోర్ దిగివచ్చి, ఆమె దగ్గరకు వెల్లి కేసు పూర్వపరాలు వివరించి,నేర అభియోగాలు నమోదు చేశారు.
