ముద్దాయి వద్దకు కదిలివచ్చిన న్యాయమూర్తి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ కు చెందిన బండి సురేశ్ ఇతరుల పైన అతని భార్య మానసిక, శారీరక వేధింపులు, అదనపు వరకట్నం రెండు లక్షలు తీసుకు రావాలని వేదిస్తున్నట్లు కోర్టులో కేసు దాఖలు చేశారు. గురువారం సదరు కేసులో ముద్దాయిలపై నేర అభియోగాల నమోదు ఉంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న అరవై ఐదేళ్ల వృద్ధ మహిళ  అనసూయ నడవడం సరిగా చేతకాదు,మెట్లు ఎక్కడం మరి కష్టం,ఒక వరకట్నం కేసులో నేర అభియోగాల నమోదు హాజరు తప్పని సరి.ఆ వృద్ధురాలి ఆరోగ్య...