27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బెట్టింగ్ బారిన పడి మరో యువకుడు ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

మేడ్చల్, బతుకమ్మ : బెట్టింగ్ బారిన పడి మరో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెళ్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ యాదగిరి రెండో కుమారుడు రాహుల్ (24) ఇంటర్ వరకు చదివి ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా రాహుల్ మద్యం తాగడం, క్రికెట్ బెట్టింగులకు బానిసగా మారాడు, అప్పు చేసి ఐపీఎల్ బెట్టింగ్‌లో పెట్టుబడి పెట్టగా, రూ.4 లక్షలు నష్టపోయాడు.  దీంతో తీవ్ర మనస్తాపానికి గురై, ఇంట్లోని తన గదిలో రాహుల్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు.

More articles

Latest article