30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పది ఫలితాల్లో విజయఢంఖా మోగించిన శ్రీ విజయసాయి విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ బోధన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ నెలలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 1గంటకు రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాల మరోసారి తన విజయఢంఖా మ్రోగిస్తూ ప్రతిభను చాటింది.  100% ఉత్తీర్ణతనం సాధించింది. 600 మార్కులకు గాను పి.శ్రీనిధి, డి.ప్రతీక్ భగత్ లు 584 మార్కులు, ఎం. వైభవి, మిఫ్రా ఫాతిమా, కె.కౌశిక్ కళ్యాణ్ లకు 583 మార్కులు, 582 మార్కులతో ఇద్దరూ, 581 మార్కులతో ఇద్దరూ, 580

Sri Vijayasai students celebrate victory in the 10th results

మార్కులతో ఇద్దరు, 33 మంది విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో  ఏ1 గ్రేడ్లు సాధించారనీ, 100% ఉత్తీర్ణత సాధించామని పాఠశాల నిర్వాహకులు ఎస్.కృష్ణమోహన్ తెలిపారు. ఇంతటి ఘనవిజయానికి సహకరించిన తమ పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర బృందానికి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి ప్రోత్సాహాలతో రానున్న రోజుల్లో మరిన్ని ఉత్తమ ఫలితాలను సాధిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. విద్యలో సరస్వతీ నిలయంగా ఉన్న బోధన్ పట్టణానికి మరింత వన్నె తెచ్చే విధంగా ఫలితాలు సాధించడం సాధించడం గర్వకారణంగా ఉందని అన్నారు.

Sri Vijayasai students celebrate victory in the 10th results

More articles

Latest article