24 C
Hyderabad
Sunday, August 2, 2026

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని రావుజీ సంగం హై స్కూల్ పూర్వ విద్యార్థులు 2002-03 ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికి పూలతో స్వాగతం పలికారు. సమావేశంలో విద్యార్థులు తమ పాఠశాల రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఉపాధ్యాయులను ఘనంగా పుషగుచ్చాలతో స్వాగతం పలికి, సన్మానించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. విద్యార్థులకు నాటి గురువులు మళ్లీ కలవడం ఆనందాన్ని నింపింది. అనంతరం కరస్పాండెంట్ మాట్లాడుతూ.. మా పాఠశాలలో విద్యబుద్ధులు నేర్చుకున్న మా విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కో విధమైన ఉన్నత స్థానాలను అధిరోహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విందు అనంతరం విద్యార్థులు తమ బాల్యస్మృతులను పంచుకుంటూ కలసి నవ్వుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులచే కట్టెతో తిన్న దెబ్బలను సరదాగా గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో గ్రూప్ ఫోటోలు తీసుకుని వాటిని గుర్తుగా భద్రపర్చుకున్నారు. విద్యార్థుల మధ్య అనుబంధాన్ని పునరుద్ధరించే ఒక అద్భుతమైన సందర్భంగా ఈ సమ్మేళనం నిలిచింది. ఈ సమ్మేళనం ప్రతి ఒక్కరికీ స్నేహాన్ని, గురువుల విలువను గుర్తు చేసే గొప్ప సందర్భంగా మారింది.  “స్నేహం కాలానికి అతీతం” అనే మాటకు నిజమైన అర్థాన్ని ఇస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

More articles

Latest article