ఖజానాను ఖాళీ చేసి మాపై నిందలా..? అని కేసీఆర్ పై విమర్శలు
హైదరాబాద్, బతుకమ్మ : మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తో భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. జానారెడ్డి, కే కేశవరావు మావోయిస్టుల అంశంపై పార్టీలో చర్చిస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రసంగం అక్కసుతో కూడుకున్నదని, ఆయన ఖజానాను ఖాళీ చేసి మాపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, అభద్రతాభావంతో కేసీఆర్ మాట్లాడారని అన్నారు. ప్రసంగంలో స్పష్టత లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.
