24 C
Hyderabad
Sunday, August 2, 2026

పొంగిపొర్లుతున్న లెండివాగు

Must read

📰 Generate e-Paper Clip

. వంతెన పైనుంచి నిలిచిన రాకపోకలు

బతుకమ్మ, మద్నూర్: ఎడతెరిపిలేని వర్షం కారణంగా మండలంలోని గోజేగావ్ లెండి వాగు పొంగిపొర్లుతోంది.  వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో సోమవారం తెల్లవారుజాము నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనను తహసీల్దార్ ఎండీ ముజీబ్ పరిశీలించారు. వాగు వంతెన పైనుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని ఆయన సూచించారు. ప్రజలు ఆందోళన చెందొద్దని, అధికారయంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. తహసీల్దార్ వెంట ఎస్సై విజయ్, ఎంపీడీవో రాణి, గిర్దావర్ శంకర్, పోలీసులు, వ్యవసాయ, పంచాయతీ అధికారులు తదితరులున్నారు.

More articles

Latest article