30.9 C
Hyderabad
Monday, August 3, 2026

దరఖాస్తులను కేటగిరీ వారీగా సేకరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : లింగంపేట్ మండలంలో జరుగుతున్న రైతు సదస్సులలో రైతులు సమర్పించిన దరఖాస్తులను కేటగిరి వారీగా సేకరణ చేయడం జరుగుతుందనిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం లింగంపేట్ మండల తహసీల్దార్ కార్యాలయంలో రైతు సదస్సుల దరఖాస్తులను పొందుపరచడం తీరును కలెక్టర్ పరిశీలించారు. మండలంలో గురువారం వరకు 12 రెవిన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించినట్లు, ఇప్పటి వరకు పలు రకాల సమస్యలపై 1416 దరఖాస్తులు రావడం జరిగాయని తెలిపారు. ప్రతీ దరఖాస్తును పరిశీలించాలని సూచించారు.  సదస్సుల అనంతరం దరఖాస్తులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్, తహసీల్దార్ సురేష్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Applications should be collected by category.

More articles

Latest article