దరఖాస్తులను కేటగిరీ వారీగా సేకరించాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : లింగంపేట్ మండలంలో జరుగుతున్న రైతు సదస్సులలో రైతులు సమర్పించిన దరఖాస్తులను కేటగిరి వారీగా సేకరణ చేయడం జరుగుతుందనిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం లింగంపేట్ మండల తహసీల్దార్ కార్యాలయంలో రైతు సదస్సుల దరఖాస్తులను పొందుపరచడం తీరును కలెక్టర్ పరిశీలించారు. మండలంలో గురువారం వరకు 12 రెవిన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించినట్లు, ఇప్పటి వరకు పలు రకాల సమస్యలపై 1416 దరఖాస్తులు రావడం జరిగాయని తెలిపారు....