27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తిరుమలలో హై అలెర్ట్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : జమ్మూకాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం అలర్ట్ అయింది. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలోను, పలుచోట్ల ఆర్టీసీ బస్సులను, ఇతర ప్రైవేటు వాహనాలను, లగేజీని క్షుణ్ణంగా సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అనుమానితులను సెక్యూరిటీ సిబ్బంది విచారిస్తూ, వారి వివరాలను సేకరిస్తున్నారు.

More articles

Latest article