రుద్రూర్, బతుకమ్మ : జమ్మూ కాశ్మీర్ లో పాల్గహంలో జరిగిన ఉగ్ర దాడికి నిరసనగా బుధవారం సాయంత్రం రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చత్రపతి శివాజీ చౌరస్తా వద్ద పార్టీలకు అతీతంగా ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ దాడిలో మరణించిన వారికీ కొవ్వొత్తులు వెలిగించి రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాశ్మీర్ లో టూరిస్టు కోసం వెళ్లిన హిందువుల పై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ అధ్యక్షులు ఆలంపాటి హరికృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం, హిందూ సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
