బతుకమ్మ,సాలుర: ప్రపంచ ధరిత్రి దినోత్సవ వేడుకలను మండలంలోని ఖాజాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈకో క్లబ్ లో భాగంగా క్యూఆర్ కోడ్ లను తయారుచేసి చెట్లకు అంటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి మొక్కలు మరియు చెట్ల యొక్క సాధారణ పేర్లు, శాస్త్రీయ నామం, వృక్షాల జాతి, ప్రజాతి, మరియు ఉపయోగాలు తదితరు అంశాలను తెలుసుకున్నారు. తదనంతరం భూమాత విలాపం అనే నాటికను ప్రదర్శించారు. ఈ నాటికలో భాగంగా మానవుడు తన స్వార్థంతో చెట్లను కొట్టివేయడం , ప్లాస్టిక్ వినియోగం, కాలుష్య కారకాలు, భూతాపం, గ్లోబల్ వార్మింగ్ తదితర అంశాలను తీసుకొని ఆలోచన రేకెత్తించే విధంగా ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా తమ పుట్టినరోజు మొక్కలను నాటుతామని, ప్లాస్టిక్ ను వినియోగించమని మరియు నీటి వనరులను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ , పిఆర్టియు మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఉపాధ్యాయులు జ్యోతి, సాయిలు, హన్మాండ్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

