ఘనంగా ధరిత్రి దినోత్సవం
బతుకమ్మ,సాలుర: ప్రపంచ ధరిత్రి దినోత్సవ వేడుకలను మండలంలోని ఖాజాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈకో క్లబ్ లో భాగంగా క్యూఆర్ కోడ్ లను తయారుచేసి చెట్లకు అంటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి మొక్కలు మరియు చెట్ల యొక్క సాధారణ పేర్లు, శాస్త్రీయ నామం, వృక్షాల జాతి, ప్రజాతి, మరియు ఉపయోగాలు తదితరు అంశాలను తెలుసుకున్నారు. తదనంతరం భూమాత విలాపం అనే నాటికను ప్రదర్శించారు. ఈ నాటికలో భాగంగా మానవుడు తన స్వార్థంతో చెట్లను కొట్టివేయడం...