బతుకమ్మ,మెండోరా: మెండోరా మండల కేంద్రంలో మంగళవారం భూ భారతి పై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ పాల్గొన్నారు. భూ భారతిపై రైతులకు అవగాహన కలిపించారు. కార్యక్రమంలో మార్కెట్, సొసైటీ కమిటీల ఛైర్మెన్లు, ముత్యం రెడ్డి, రాజ రెడ్డి, తహసీల్దార్ సంతోష్ రెడ్డి,ఎంపీడీఓ వనజ, మండల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
