నిజాంసాగర్, బతుకమ్మ: బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ కు చెందిన అబ్దుల్ సలాం(37) నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడి తమ్ముడు అబ్దుల్ రెహమాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సలాం ఆత్మహత్యకు కారాణాలు తెలియాల్సి ఉంది.
