27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ దాడి

Must read

📰 Generate e-Paper Clip

  • 11మంది పేకాట రాయుళ్ళ అరెస్ట్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై దాడి చేసి ఆదివారం 11మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపారు. నవీపేట్ మండలంలోని యంచ గ్రామ శివారులో గల పంట పొలాల్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది, నవీపేట్ పోలీసులు దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో 11మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 6 ధ్విచక్ర వాహనాలు, 10సెల్ ఫోన్స్, రూ.31460 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం నవిపేట ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు తెలిపారు.

More articles

Latest article