30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

హాస్టల్ ఆవరణలో టేకు చెట్ల నరికివేత

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి లోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఆవరణలో ఉన్న టేకు చెట్లను వార్డెన్ శారద నరికివేయించి దుంగలను అక్కడే ఎవరికీ కనిపించకుండా పెట్టించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు ఉన్నతాధికారుల అండదండలతో వార్డెన్ సుమారు 20 టేకు చెట్లను నరికివేయించారంటున్నారు.

ఒక చెట్టును తొలగించాలంటే రెవెన్యూ అధికారులు లేదా ఫారెస్ట్ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. వార్డెన్ శారద తనకు సంబంధం లేని చోట టేకు చెట్లను నరికివేయించినా పట్టించుకునే వారు కరువయ్యారు. టేకు చెట్లను నరికివేయించిన వార్డెన్ విద్యార్థుల కోసం సరఫరా అయ్యే బియ్యాన్ని సైతం అమ్ముకుంటున్నారని, ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

 

Cutting of teak trees in the hostel premises

More articles

Latest article