26.6 C
Hyderabad
Monday, August 3, 2026

జేఈఈ మేయిన్స్ లో కాకతీయ విద్యార్థుల ప్రతిభ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జేఈఈ మేయిన్స్ -2025 ఫలితాల్లో కాకతీయ విద్యా సంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చాటారని డైరెక్టర్ సీహెచ్.రామోజీ రావు(ఐఐటీఐఎఎన్) తెలిపారు. శనివారం విడుదల చేసిన జేఈఈ మేయిన్స్ ఫలితాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతూ ఇంటర్ తో పాటు తొలి ప్రయత్నంలోనే డైరెక్టుగా ఐఐటీ – జేఈఈ మేయిన్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో మేఘన 824, సంకీర్త్ 1750, భాను ప్రతాప్ 3820, ప్రవీణ్ 7456, జె.అరవింద్ 11246, జి.వేదాక్షర్ 12385, వి.వికేతన్ 21519, ఎ.హాసిని 30243, పి.అమ్రుత్ వర్ష్ 39052, ఎండీ.ముదస్సీర్ 43733, ఎస్.తనూజ 44161, ఎం.భవ్యశ్రీ 48472 ర్యాంకులు సాధించి కాకతీయ విద్యా సంస్థల సత్తా చాటారని అన్నారు. ఈ విజయానికి కారకులైన కాకతీయ విద్యార్థినీ, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విశేషమైన క్రుషిచేసిన అద్యాపక బ్రుందానికి, ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు కాకతీయ విద్యా సంస్థల చైర్పర్సన్ సీహెచ్.విజయ లక్ష్మీ అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో ఐఐటి  అధ్యాపక బ్రుందం, కాకతీయ విద్యా సంస్థల ప్రిన్సిపల్ వి.రణధీష్ శర్మ, సందీప్ కులకర్ణి, వైస్ ప్రిన్సిపల్ శ్యాం, జ్యోత్స్న, కాకతీయ సిబ్బంది పాల్గొన్నారు.

  • యాజమాన్యం సహకారం మరువలేనిది : ఎం.సంక్రీత్

జేఈఈ మేయిన్స్ ఫలితాలలో ఇంటర్మీడియెట్ తో పాటు మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 1750 ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. ఈ ర్యాంకు సాధించడానికి కాకతీయ కళాశాల డైరెక్టర్ సీహెచ్.రామోజీరావు సహకారం మరువలేనిది. ఎల్లవేళలా అందుబాటులో ఉండి కౌన్సిలింగ్ నిర్వహిస్తుండే వారు. కాకతీయ అధ్యాపక బ్రుందం అద్భుతమైన కోచింగ్ వల్ల ఈ ర్యాంకు సాధించగలిగాను.

Kakatiya students excel in JEE Mains

More articles

Latest article